ETV Bharat / state

'అమ్మాయిల హాస్టల్​లో అబ్బాయి'.. ఘటనపై చర్యలు - నూజివీడు ట్రిపుల్​ ఐటీ గర్ల్స్​ హాస్టల్ ఘటన న్యూస్

నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో టెక్​ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఘటనపై ఉపకులపతి హేమచంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

nuziveedu-iiit-vice-chancellor-about-boy-entered-into-girls-hostel-incident

author img

By

Published : Feb 24, 2020, 5:41 PM IST

Updated : Feb 24, 2020, 6:48 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్​లో జరిగిన ఘటనపై ఉపకులపతి హేమచంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మైనారిటీ తీరని కారణంగా వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి.. విద్యార్థులను పంపించామని అన్నారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఘటనలో సెక్యూరిటీ అజాగ్రత్త స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీనేజ్​లో విద్యార్థులు ఆకర్షణకు గురై బంగారు భవిష్యత్​ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

అసలేం జరిగిందంటే..?

విద్యార్థినుల వసతి గృహాలుండే చోట సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మాత్రం కిటికీ గ్రిల్స్ పగలగొట్టినా వినిపించలేదు. ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్​లోకి అదే క్యాంపస్​కు చెందిన ఓ విద్యార్థి (బాలుడు) ప్రవేశించాడు. తనకు తెలిసిన అమ్మాయి గదికి వెళ్లాడు. 11 గంటలు గదిలోనే ఉన్నాడు. అయినా ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి ఎవరూ తీసుకెళ్లలేదు. ఎలాగోలా అధికారులకు సమాచారం అందింది. సిబ్బందికి విషయం తెలిసిన వెంటనే గునపాలతో ఆ గది వైపు వెళ్లారు. తాళం పగలగొట్టారు. తలుపు తెరవగానే గదిలో అమ్మాయి కనిపించింది. 'ఏంటి తల్లీ తాళం వేసిన గదిలో ఉన్నావ్' అని అడిగితే... ఆ విద్యార్థిని నుంచి సమాధానం లేదు. సెక్యూరిటీకి సిబ్బంది మంచాలను పక్కకు జరిపి చూశారు. గదిలోని ఓ మంచం కింద ఉన్నాడో విద్యార్థి. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు ఉపకులపతి హేమచందారెడ్డి తెలిపారు.

'అమ్మాయిల హాస్టల్​లో అబ్బాయి'.. ఘటనపై చర్యలు

ఇదీ చదవండి: అమ్మాయిల హాస్టల్​లో అబ్బాయి...సెక్యూరిటీ నిద్రపోయారేమో..!

Last Updated : Feb 24, 2020, 6:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.