ETV Bharat / state

మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌గా ఎంపికైన నిత్యా కొడాలి - Nithya Kodali latest news

మిస్ టీన్ తెలుగు యూనివర్స్​ కీిరిటం తెలుగమ్మాయి నిత్యా కొడాలిని వరించింది. అమెరికాలోని హ్యూస్టన్​లో జన్మించిన 15ఏళ్ల నిత్యా....దాదాపు 800 మంది విద్యార్థుల్లో మొదటిస్థానం పొంది ఘనత సాధించింది.

మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌గా ఎంపికైన నిత్యా కొడాలి

author img

By

Published : Oct 28, 2020, 12:37 PM IST

ప్రతిష్టాత్మక మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కిరీటం తెలుగమ్మాయి నిత్యా కొడాలి దక్కించుకుంది. 40కి పైగా దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ పోటీల్లో....నిత్యా కొడాలి తొలిస్థానం దక్కించుకున్నారు. అమెరికాలోని హ్యూస్టన్​లో జన్మించిన 15ఏళ్ల నిత్యా....దాదాపు 800 మంది విద్యార్థుల్లో మొదటిస్థానం పొంది ఘనత సాధించారు. ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంస్థతో పాటు వందకిపైగా తెలుగు సంస్థలు ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి.

మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌గా ఎంపికైన నిత్యా కొడాలి

తెలుగుభాషా పరిజ్ఞానం, సామాజిక సేవా దృక్పథం, విద్య, నృత్యం, ఇతర సాంస్కృతిక కళల్లో విశేష ప్రతిభ కనబరిచి నిత్యా అందరి దృష్టిని ఆకర్షించారు. మిస్ ఎర్త్ ఇండియా తేజస్విని మనోజ్ఞ నుంచి మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కిరీటాన్ని నిత్యాకొడాలి అందుకున్నారు. ఈ ఘనత సాధించటం పట్ల నిత్యా హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రైతుల ఆర్థిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం వైఎస్​ జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.