ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలనూ... వైకాపా కింద పనిచేసే వాలంటీర్ వ్యవస్థగా మార్చేశారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులకు వర్తించని కొవిడ్ నిబంధనలు లోకేశ్‌కు మాత్రమే ఎలా వర్తిస్తాయో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యే విడదల రజనీ ట్రాక్టర్ తోలారు, రోజా అంబులెన్స్ నడిపారు, ఉండవల్లి శ్రీదేవి ట్రాక్టర్ నడిపితే బియ్యపు మదుసూధన్ రెడ్డి వేలాదిమందితో ట్రాక్టర్ ర్యాలీలు తీశారని రామానాయుడు గుర్తుచేశారు. వారెవరికీ కొవిడ్ నిబంధనలు వర్తించవా... అని ప్రశ్నించారు.
రాజప్రాసాదాల్లో కూర్చొనే ముఖ్యమంత్రికి, మంత్రులకు నీళ్లలో మగ్గుతున్న రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని నిలదీశారు. నీళ్లలో నానుతున్న ప్రజల వద్దకు లోకేశ్ వెళ్లడం చూసి ప్రభుత్వం అసూయ చెందుతుందని ధ్వజమెత్తారు. అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకి 25వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటు 5వేల సాయం అందించాలన్నారు.
ఇదీ చదవండి: దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని మోదీ సమీక్ష