కృష్ణా జిల్లాలోని విజయవాడ గ్రామీణ మండలంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ధనుర్మాసం పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన ఆయనకు దేవాదాయ శాఖ ఇన్స్‌స్పెక్టర్ ఫణికుమార్, అర్చక స్వాములు స్వాగతం పలికారు. ఆలయంలోని గోదా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశ్వీరచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కృష్ణాజిల్లాలోని ప్రసిద్ధి గాంచిన మోపిదేవి ఆలయాన్ని ఇప్పటికే సందర్శించానని, పెద్దకళ్లేపల్లి ఆలయాన్ని సందర్శిస్తానని రమేష్ కుమార్ తెలిపారు.
సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్...
కృష్ణా జిల్లా మోపిదేవి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు ప్రసాదం, స్వామి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు.
ఇదీ సమాచారం: