నీట్లో అర్హత పొందిన విద్యార్ధులకు త్వరలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు . ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల వివరాలకు సంబంధించిన ఉత్తర్వులు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో 500సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు . యాజమాన్య సీట్లు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని భావిస్తున్నట్లు వర్శిటీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్వీఎస్ కాలేజీ విద్యార్ధులను ప్రభుత్వ కాలేజీల్లోకి భర్తీ చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి సి వి రావు తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
ఇవీ చదవండి