వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు దేశీయ పర్యాటక వ్యయం, అభివృద్ధిని నిర్దేశించే బహుళ సూచికలపై జాతీయస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాంతాల వారీగా జాతీయ గణాంక కార్యాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ, కడపలోని జాతీయ గణాంక కార్యాలయాల పరిధిలో నాలుగు రోజులపాటు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.
దేశంలో అతిథ్యం, హస్తకళలు, రవాణ సేవలు, సహజ వనరులు వంటి వివిధ రంగాలు ఉపాధి కల్పనతో పాటు పర్యాటక ప్రాముఖ్యతను పెంచుతున్నాయని కార్యక్రమానికి హాజరైన వక్తలు తెలిపారు. పర్యాటక ప్రదేశాల సందర్శనతో పాటు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఆసుపత్రులకు వెళ్లడం, రాత్రిపూట ఆతిథ్య కేంద్రాల్లో బస చేయడం వంటివి పర్యాటక వ్యయంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
2014లో నిర్వహించిన సర్వేలో ఆసుపత్రులకు వ్యయం కనిష్టంగా ఒక సందర్శనకు రూ.15 వేలకు మించి అవుతున్నట్లు వెల్లడైందన్నారు. ఈసారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఈ సర్వే ద్వారా గణన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళిక విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి జీఎస్ఆర్‌కెఆర్ విజయకుమార్, రాష్ట్ర ప్రణాళిక విభాగం డైరెక్టర్ డి. ప్రతిమ, జాతీయ గణాంక విభాగం దక్షిణ భారత ఇన్‌ఛార్జ్ కస్తూరి రాజేశ్వరి, ప్రాంతీయ సంచాలకులు రావూరి కిరణ్‌కుమార్ తదితరులు ప్రారంభించారు.
ఇదీ చూడండి: