గోదావరి వరద ఉద్ధృతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పోలవరం ముంపు ప్రాంతాల గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు నరహరి వరప్రసాద్ డిమాండ్ చేశారు. చలికి వణుకుతూ, చెట్టపైకెక్కి ప్రాణాలు కాపాడుకోవాల్సిన దుస్థితి వచ్చినా వైకాపా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పోలవరం ముంపు ప్రజలకు రూ. 10లక్షలు ఇస్తానని చెప్పిన సీఎం జగన్ ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర బలగాల సాయంతో బాధితులను రక్షించాలన్నారు. వరదల వలన నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 10వేలు ఇవ్వాలని నరహరి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..