అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ పీఎస్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. హింసించే పులకేశి రెడ్డి.. ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటిని ఎద్దుర్కొనేందుకు తాను సిద్ధమని లోకేశ్ ట్వీట్ చేశారు. తెదేపా కార్యకర్త మారుతిపై హత్యాయత్నానికి పాల్పడిన వైకాపా శ్రేణులను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడులు చేస్తున్న వైకాపా నేతలపై ఎందుకు కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. ప్రశ్నించే నేతలను భయపెట్టేందుకు కేసులు పెడుతున్నారని లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకేనా అని లోకేశ్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
టీకాలపై కేంద్రం వ్యయం అంతంతమాత్రమే!
ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు.. సూచనలిచ్చే స్వేచ్ఛ లేదు: తెదేపా నేతలు