ETV Bharat / state

NTR TRUST: నారా భువనేశ్వరి దాతృత్వం.. పేద విద్యార్థులకు ఉచితంగా విద్య

కృష్ణ జిల్లా చల్లపల్లి ఎన్టీఆర్ హైస్కూల్ బ్రాంచ్​లో డే - స్కాలర్స్​గా 6 నుంచి 9 తరగతి చదివే స్థానిక విద్యార్ధులకు ఉచిత విద్యను అందించాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. అయితే తరగతికి 10 మంది చొప్పున 40 మందిని ఎంపిక చేసి వారికే ఉచిత విద్యను అందించాలని నిర్ణయించినట్లు భువనేశ్వరి తెలిపారు. అభ్యర్థుల సంఖ్య నిర్ణయించిన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగా వుంటే సెప్టంబర్ 25వ తేదీన ప్రతిభ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

నారా భువనేశ్వరి
నారా భువనేశ్వరి
author img

By

Published : Sep 17, 2021, 5:49 PM IST

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి దాతృత్వం చూపారు. కృష్ణా జిల్లా చల్లపల్లి ఎన్టీఆర్ హైస్కూల్​లో డే - స్కాలర్స్​గా 6 నుంచి 9 తరగతి చదివే స్థానిక విద్యార్ధులకు ఉచిత విద్య అందివ్వాలని నిర్ణయించారు. తరగతికి పది మంది చొప్పున 40 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచిత విద్యను అందించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.

అభ్యర్థుల సంఖ్య, నిర్ణయించిన సీట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటే సెప్టెంబర్ 25వ తేదీన ప్రతిభ పరీక్ష పెట్టనున్నట్లు వెల్లడించారు. తద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉచిత విద్యకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్ధినీ విద్యార్ధులు.. చల్లపల్లి ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్​ను సంప్రదించి సెప్టెంబర్ 22వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

2005వ సంవత్సరం నుండి ఎంతోమంది అనాథ, నిరుపేద బాలబాలికలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్​ ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నట్లు భువనేశ్వరి గుర్తు చేశారు.

ఇదీ చదవండి: CBN HOME: చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్‌ ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.