దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సీపీఎం నాయకులు ఆగస్టు 20 నుంచి 26 వరకు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నందిగామ మున్సిపల్ కార్మికులు... స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద 'చెవిలో పువ్వు' కార్యక్రమం ద్వారా నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చెయ్యాలని, స్పెషల్ అలవెన్స్లు రూ. 25 వేలు ఇవ్వాలని, రక్షణ పరికరాలు, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమి స్కిల్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కార్మికులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరారు. అలాగే అర్హలైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :