మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు కేసు చట్టవిరుద్ధమని ఆ పార్టీ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. ఈఎస్‌ఐ కార్యకలాపాలు కేంద్రానికి సంబంధించినవని తెలిపారు. ఈఎస్‌ఐలో ఇలాంటివే తెలంగాణలోనూ జరిగాయని ఆయన ఆరోపించారు.
న్యాయస్థానంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడుపై కక్షతోనే అభియోగాలు మోపారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇదీ చదవండి: పరామర్శించడానికి వెళితే అనుమతి ఇవ్వలేదు: చంద్రబాబు