ETV Bharat / state

హడావుడిగా ‘నాడు - నేడు’ పనులు - krishna district latest update

ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయాలని నాడు..నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పనులను తల్లిదండ్రుల కమిటీలే చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వహణపై సరైన ప్రణాళిక లేక, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేక పోవడం తదితర కారణాలతో ప్రస్తుతం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

గూడూరు మండలం మల్లవోలులో నిర్మాణ దశలో ఆగిన పాఠశాల భవనం
author img

By

Published : Oct 1, 2020, 1:17 PM IST

గూడూరు మండలం మల్లవోలులో నిర్మాణ దశలో ఆగిన పాఠశాల భవనం

ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయాలని నాడు..నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పనులను తల్లిదండ్రుల కమిటీలే చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వహణపై సరైన ప్రణాళిక లేక, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేక పోవడం తదితర కారణాలతో ప్రస్తుతం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ఒత్తిళ్లు పెట్టి పనులు చేయించడంతో తరువాత నిధులు మంజూరవుతాయిలే అని చాలామంది తమ సొంత నిధులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు.

ఎప్పట్లో పూర్తవుతాయో!

● జిల్లావ్యాప్తంగా తొలివిడతగా 1153 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. మరుగుగొడ్లు, తాగునీటి సరఫరా, భవనాల మరమ్మతులు ఇలా అనేక పనులు చేపట్టారు. నూరుశాతం పూర్తి చేయడంపై ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ సమాయానికి పూర్తికాకపోవడంతో మళ్లీ గడువు పెంచుతున్నారు.

మచిలీపట్నం, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో 80శాతం వరకు పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టిన ప్రధానోపాధ్యాయులు ఇంకా వెచ్చించలేని పరిస్థితుల్లో చాలామంది పనులు నిలిపివేశారు.

రూ.20 కోట్ల బకాయిలు

నిధులు సకాలంలో అందకపోవడంతో ఒక్కో ఉపాధ్యాయుడు రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తరువాత నిధులు విడుదల అవుతాయని భావించి హడావుడిగా పనులు చేయించారు. జులై నుంచి ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల కమిటీల్లో ఉన్న నాయకులు కూడా ఉపాధ్యాయులపై ఒత్తిళ్లు తెచ్చారు. పనుల్లో పాల్గొన్న కూలీల సంఖ్య పెంచి రాయాలని, తాము చెప్పిన దుకాణాల్లోనే సామగ్రి కొనుగోలు చేయాలని ఒత్తిళ్లు తెచ్చారు.

ఇవిగో అడ్డంకులు

గూడూరు మండలంలో 24 పాఠశాలల్లోని నాడు-నేడులో భాగంగా పనులు చేపట్టారు. ఈ పనుల నిమిత్తం రూ.3.32 కోట్లు కేటాయించారు. చివరిదశలో నిధులు మంజూరు కాకపోవడంతో మల్లవోలు, కప్పలదొడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలతోపాటు తరకటూరు, రాయవరం, కంచాకోడూరు ప్రధాన ప్రాథమిక పాఠశాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి.

బందరు మండలం 37 పాఠశాలల్లో పనులు చేపట్టగా నిధులు రాని కారణంగా సుల్తానగరం, క్యాంప్‌బెల్‌పేట, రుద్రవరంలో పనులు నిలిచిఊపోయాయి. చివరి దశలో పనులు ఆగిపోవడంపై ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పెడన మండలంలో 24 పాఠశాలలకు రూ.3.30కోట్లు కేటాయించారు. 75శాతం పనులు పూర్తయిన తరువాత పెడన పట్టణంలోని భట్టజ్ఞానకోటయ్య హైస్కూల్‌తోపాటు మండలపరిధిలోని చెన్నూరు, చేవెండ్ర, పెనుమల్లి, ఉరిమి ఇలా అనేక పాఠశాలల్లో పనులు ఆగిపోయాయి.

విస్సన్నపేట మండలంలోని 15 పాఠశాలల్లో పనులు చేపట్టగా తెల్లదేవరపల్లి ప్రధాన ప్రాథమిక, విస్సన్నపేట జడ్పీ ఉన్నతపాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి.

బంటుమిల్లి మండలంలో 22 పాఠశాలలకు రూ.2.13 కోట్లు, కృత్తివెన్ను మండలంలోని 14 పాఠశాలలకు రూ.1.24కోట్లు కేటాయించగా ప్రస్తుతం ఆయా మండలాల్లో ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో పనులు నిలిపివేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

అప్పులుచేసి ఆందోళన

నాడు-నేడు పనుల నిమిత్తం చాలామంది ఉపాధ్యాయులు అప్పులు చేసి ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఒత్తిడి పెట్టడంతో నిధులు వచ్చేస్తాయి కదా అని ప్రధానోపాధ్యాయులు బయట అప్పులు తెచ్చి, బంగారు నగలు కుదువపెట్టి పెట్టుబడి పెట్టారు. ఇంత చేసినా పనులు చివరి దశలో ఆగిపోవడంతో అటు పూర్తి చేశామన్న సంతృప్తిలేదు, ఇటు పెట్టుబడి పెట్టిన డబ్బులూ రావడం లేదు. చాలామంది అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సకాలంలో నిధులు విడుదలచేయాలని కోరుతున్నాం. - చేబ్రోలు శరత్‌చంద్ర, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు

నిధులు విడుదల చేస్తాం

నాడు-నేడు పథకంలో భాగంగా చేపట్టిన పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 80శాతం వరకు పూర్తయ్యాయి. నిధుల విడుదలలో కొంత జాప్యం ఏర్పడింది. వారంలోపు నిధులు విడుదల అవుతాయని సమాచారం అందింది. ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాం. - జి.రవీందర్‌, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్

ఇదీ చదవండి

విజయవాడ బాపు ప్రదర్శనశాల పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.