రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కౌలు చట్టాలకు రూపకల్పన చేస్తే కౌలు రైతులకు రుణ సదుపాయం మరింత సులువు అవుతుందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంక్- నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు చెప్పారు.
ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేసినట్టు ఆయన చెప్పారు. మొత్తం నాబార్డు రుణాలు, గ్రామీణాభివృద్ది కేటాయింపుల్లో పది శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటోందని నాబార్డ్ ఛైర్మన్ వెల్లడించారు. కొవిడ్ నేపథ్యంలో మొత్తం ఒక లక్ష 30 వేల కోట్ల రూపాయలు ఈ ఏడాది రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన ఈటీవీ భారత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
రుణాల పర్యవేక్షణకు త్వరలో నిరీక్షణ పేరుతో ఓ యాప్ను అందుబాటులోకి తెస్తున్నట్టు గోవిందరాజులు వివరించారు. వచ్చే ఆరు నెలల్లో పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఙానం ఉపయోగించటం ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం రుణ విధానాన్ని నేరుగా పర్యవేక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొవిడ్ కారణంగా దేశంలో రైతే రాజు, వెన్నెముక అన్నది మరోసారి రుజువైందంటోన్న నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులుతో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ఇదీ చూడండి. సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి