కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, కరోనా సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్న జర్నలిస్టులకు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్95 మాస్కులు పంపిణీ చేశారు. పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు డా.వేములపల్లి సురేష్ సహకారంతో 50 వేల రూపాయల విలువైన ఆరోగ్య భద్రతా కిట్లను ఎస్పీ రవీంద్రనాధ్బాబు చేతుల మీదుగా అందజేశారు.
ఇదీ చదవండి: చల్లపల్లిలో 10 ఎకరాల గడ్డివాము దగ్ధం