కృష్ణా జిల్లాలో 2019-20 ఖరీఫ్, రబీ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 88.90 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేశామన్నారు.
ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురిసి ధాన్యం దిగుబడులు ఎక్కువగా వచ్చాయని, అడపాదడపా కురిసిన వర్షాలకు కొద్దిమేర ధాన్యం తడిసిన కూడా ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. అదే విధంగా రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు కావలసిన విత్తనాలు సిద్ధం చేశామని తెలిపారు. తెదేపా నేత దేవినేని ఉమ.. ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు. చౌకబారు ఆరోపణలు మానాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: