కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జవ్వాది సత్యనారాయణ అనే వ్యక్తి హత్య కలకలం రేపుతుంది. సత్యనారాయణ డెకరేషన్ వృత్తి కొనసాగిస్తున్నాడు. సత్యం వద్ద పని చేసే ఓ వ్యక్తి హఠాత్తుగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో ఘర్షణ జరుగుతుందని పోలీసుల దర్యాప్తులో తేలింది .
ఇదీ చదవండి 'ప్రధాని ఆశయానికి గత, ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నాయి'