కృష్ణా జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. కారు ఫైనాన్స్ డబ్బులు అడిగేందుకు వెళ్ళిన ఓ ఉద్యోగిపై తండ్రికొడుకులు కత్తితో దాడి చేశారు. చిలకలపూడికి చెందిన జ్యువెలరీ షాపు యజమాని, అతని కుమారుడు ఇద్దరు కలిసి ఫైనాన్స్ ఉద్యోగి రాజేష్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మాచవరంలో రోడ్డులో కత్తితో పొడిచి పక్కనే ఉన్న మురుగునీటి కాల్వలో పడేసి నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రాజేష్‌కు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర వైద్యం అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ స్వస్థలం పెడనగా పోలీసులు గుర్తించారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన తండ్రి కొడుకుల కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.