తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు కృష్ణాజిల్లా నందిగామలో విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు నగర పంచాయతీ కార్యాలయంలో ఆందోళనలు చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నరేష్, విజయ మాణిక్యం, పిచ్చయ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల