కృష్ణాజిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు ఉయ్యూరు, నూజివీడు, నందిగామ, పెడన, తిరువూరు పురపాలికల్లో.. ఎన్నికలు జరగనున్నాయి. 2020 మార్చి 9 నాటికి నమోదైన లెక్కల ఆధారంగావిజయవాడ కార్పొరేషన్‌లో..మొత్తం 7లక్షల 81వేల 640 మంది ఓటర్లుంటే.. అందులో 3లక్షల 85వేల 898 మంది మహిళలున్నారు. ఇక మచిలీపట్నంలో.. లక్షా 33వేల 466 ఓటర్లకుగాను..64వేల 621 మంది పురుషులు, 68వేల 835మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఇక పురపాలికల్లో చూస్తే పెడనలో 25వేల 536 మంది ఓటర్లుంటే.. అందులో పురుషులు 12వేల 373మంది, మహిళలు 13వేల163మంది ఉన్నారు. నందిగామలో 35వేల 231ఓటర్లకుగాను..17వేల 64మంది పురుషులు,18వేల164 మంది మహిళా ఓటర్లున్నారు. నూజివీడు పురపాలికలోని 40వేల 674 ఓటర్లలో 19వేల 723మంది పురుషులు, 20వేల 947 మంది మహిళలున్నారు.
తిరువూరులో 27వేల 836ఓటర్లుంటే... అందులో 13వేల 568మంది పురుషులు, 14వేల 266మంది మహిళలున్నారు. ఇక ఉయ్యూరులో 31,996మంది ఓటర్లుంటే 15వేల 608 మంది పురుష ఓటర్లు,16 వేల 388 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తంగా ఏడు పట్టణాల్లో 10 లక్షల 76 వేల 379మంది ఓటర్లుంటే..5లక్షల 28వేల 855 మంది పురుష.. 5లక్షల 47వేల 384 మంది మహిళా ఓటర్లున్నారు.మొత్తంగా చూస్తే పురుషలకన్నా 18వేల 529 మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి.
ఇక జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. అధికంగానే ఉన్నాయి. మొత్తం 1247 కేంద్రాల్లో పోలింగ్ జరగనుండగా.. ఇందులో 466 సమస్యాత్మక కేంద్రాలు, 312అతిసమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
ఇదీ చదవండి: గ్రీన్‌కార్డులపై ఆంక్షలు ఎత్తివేసిన బైడెన్