ETV Bharat / state

MP RRR: నాపై వేటు వేయించలేమని చెప్పండి.. తక్షణం రాజీనామా చేస్తా - ఎంపీ రఘురామ - mp raghu rama cpmments on kodali nani

వైకాపా నేతలపై ఎంపీ రఘురామ విమర్శలు గుప్పించారు. తనపై అనర్హత వేటు వేయించలేమని చెబితే తక్షణం రాజీనామా చేస్తానని ఎంపీ సవాల్ విసిరారు. ఏపీ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని వెల్లడించారు.

mp raghu rama cpmments on kodali nani
mp raghu rama cpmments on kodali nani
author img

By

Published : Jan 22, 2022, 5:34 PM IST

చిరంజీవిపై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామ అన్నారు. సినిమా టికెట్ల అంశంపై చర్చలకు పిలిస్తే వచ్చానని చిరంజీవి చెప్పారని.. కేవలం భోజనం చేయడానికి వచ్చారని పేర్ని నాని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా పేర్ని నాని ఒక వీడియో విడుదల చేశారని.. ఇందులో ఎవరిని ఉద్దేశించి వీడియోలో మాట్లాడారనేది చెప్పాలన్నారు.

తపై అనర్హత వేటు వేయించలేమని చెబితే తక్షణం రాజీనామా చేస్తానని ఎంపీ రఘురామ సవాల్ విసిరారు.తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును తమ సీఎం నిలిపివేయించారన్నారు. ఏపీ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని చెప్పారు. గుడివాడ క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పిన రఘురామ.. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికే నష్టం ..

ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ విధి అన్నారు. పీఆర్సీ వివాదంపై సీఎం నిర్దేశం ప్రకారం మంత్రులు ప్రజల ముందుకెళ్తే... ప్రభుత్వానికి నష్టమన్నారు.

ఇదీ చూడండి:

Maoist : మావోయిస్టుల దుశ్చర్య...12 వాహనాలకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.