తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో.. స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పాలన అలవోకగా సాగేదని అన్నారు. క్లిష్ట పరిస్థితులను సైతం చంద్రబాబు మొక్కవోని దీక్షతో ఎదుర్కొనేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అవగాహనలేమితో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధతతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోందన్నారు. లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. 'కరోనా నియంత్రణకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది'