ETV Bharat / state

లాక్‌డౌన్‌ ప్రభావంతో తల్లి రొయ్యల కొరత - కృష్ణా జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రభావంతో తల్లి రొయ్యల కొరత

కృష్ణా జిల్లాలో ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఆక్వా రంగంలో ఒడుదొడుకులు తప్పడం లేదు. కొవిడ్‌-19 వల్ల వచ్చిన ఇబ్బందులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నాలుగు నెలలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న సాగుదారులు ప్రస్తుతం రొయ్య పిల్ల ధర పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ ప్రభావం తక్కువగా ఉండి.. వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులంతా దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. విత్తన రొయ్య ఉత్పత్తికి అవసరమైన తల్లి రొయ్య లేకపోవడంతో రేటు ఆమాంతంగా పెంచేశారు. ధర పెరిగినా సకాలంలో పిల్ల అందుతుందన్న భరోసా లేదు. వేల ఎకరాల్లో చెరువులను సిద్ధం చేసుకుని రొయ్య పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు.

royya
royya
author img

By

Published : Jul 3, 2020, 12:49 PM IST

కృష్ణా జిల్లాలో అయిదేళ్లుగా క్రమంగా చేపల సాగు తగ్గుతూ రొయ్యల సాగు పెరుగుతోంది. ఇందుకు కారణం మూడు నెలల పంట, కాస్త జాగ్రత్తగా చూసుకుంటే లాభాలు అధికంగా ఉంటాయని సాగుదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అయిదేళ్ల క్రితం కేవలం 15 వేల ఎకరాల్లోపు ఉన్న రొయ్యల సాగు ప్రస్తుతం 80 వేలకు విస్తరించిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఈ సాగులో ఒడుదొడుకులతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తీవ్ర స్థాయిలో రొయ్యల సాగు పెరగడం, తదనుగుణంగా పిల్ల ఉత్పత్తి లేకపోవడంతోనే ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.

కొరతకు కారణాలు ఇవే..

రొయ్య విత్తనం ఉత్పత్తి చేయడానికి అవసరమైన బ్రూడర్స్‌ను ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాల నుంచి మనరాష్ట్రం దిగుమతి చేసుకుంటోంది. కొవిడ్‌-19 వల్ల రవాణా నిలిచిపోవడంతో వాటి దిగుమతి ఇబ్బందికరంగా మారింది.యాంటీ బయోటిక్స్‌ వినియోగంపై అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడంతో క్షేత్రస్థాయిలో వీటి వాడకం తగ్గి రొయ్యపిల్ల ఉత్పత్తిపై ప్రభావం పడింది.

అనుమతి లేని, అనధికార హేచరీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో విత్తనోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం విజయవాడ, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, పాండిచ్చేరి ప్రాంతాల్లోని కొన్ని హేచరీల్లోనే విత్తనోత్పత్తి చేస్తున్నారు. అనుకూలమైన సమయం కావడంతో రైతులంతా ఒకేసారి పెద్ద ఎత్తున చెరువులు సాగుకు సిద్ధం చేసుకోవడంతో కొరత ఏర్పడింది.

రెట్టింపైన ధర..

విత్తన రొయ్య ఉత్పత్తి తగ్గిపోవడంతో క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని అనుసరించి వాటి ధర ఒకేసారి రెట్టింపయ్యింది. అనుకున్న స్థాయిలో పిల్లలు లేకపోవడం, ఒకేసారి ఎక్కువ డిమాండ్‌ ఏర్పడటంతో హేచరీలు ధరను అమాంతం పెంచేశాయి. నెల క్రితం వరకు 25, 30 పైసలు ఉన్న రొయ్యపిల్ల ప్రస్తుతం 45 పైసల నుంచి 50 పైసలు పలుకుతోంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం వీటి ధరను 35 పైసలకు మించి అమ్మరాదని ఆదేశాలు జారీ చేసినా హేచరీ యజమానులు బోనస్‌ లేకుండా మాత్రమే ఈ రేటుకు ఇస్తామని ఆంక్షలు పెడుతున్నారు. బోనస్‌తో ఇవ్వాలంటే అధిక రేటు చెల్లించుకోవాల్సిందే.

త్వరలో సర్దుకునే అవకాశం..

తల్లి రొయ్య దిగుమతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. త్వరలో పరిస్థితులు సర్దుకునే అవకాశం ఉంది. అనుమతి లేని హేచరీల వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే వాటిపై రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుని మూసివేసింది.. ప్రభుత్వం రొయ్య పిల్ల ధరను నిర్ధేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగానే హేచరీల యజమానులు నడుచుకోవాలి. - సాల్మన్‌ సుధాకర్‌, ఏడీ, మత్స్యశాఖ

ఎగుమతి రొయ్యల ధరలు తగ్గుదల

రొయ్యపిల్ల ధరలు పెరగడంతో పాటు ఉత్పత్తి చేసిన రొయ్యల ధరలు రెండు వారాలుగా తగ్గుతున్నాయి. 30, 40, 50 కౌంట్‌ ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా.. 100, 90 చిన్న కౌంట్ల ధరల్లో కేజీకి రూ.25 తగ్గిపోయింది. టన్నుకు రూ.25 వేల వరకు రైతులు నష్టపోతున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ కోరల్లో యువత.. అప్రమత్తంగా లేకుంటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.