ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ నగరంలో తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మోప్మా సైతం ఈ కార్యక్రమానికి సహకారం అందించింది. బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ట్రెండ్ సెట్ మాల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లులతో ర్యాంప్ వాక్ నిర్వహించారు. స్థానిక మహిళలతో పాటు మెప్మా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం 6 నెలల పాటు తల్లిపాలు ఇస్తే బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగతుందని అంతే కాకుండా పాలిచ్చే తల్లులు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని వైద్యనిపుణులు వెల్లడించారు. తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ.. ప్లకార్డులు చేతబట్టుకుని గర్భిణులు, పాలిచ్చే తల్లులతో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సభ్యులు చేయించిన ర్యాంప్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది.
ఇదీ చూడండి ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!