మహాశివరాత్రికి మోపిదేవి ఆలయం ముస్తాబు - mopidevi temple decored and ready for mahasivaratri
కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి వారి దేవస్థానం మహాశివరాత్రికి ముస్తాబు అవుతోంది. సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణానదిలో స్నానం ఆచరించడం, పితృ దేవతలకు పిండ ప్రధానం చేయటం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి ఉత్సవాలపై మచిలీపట్నం రెవెన్యూ అధికారులు దేవస్థానం శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఉద్యోగులకు సూచనలు ఇచ్చారు.