కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఆలయ ఈవో, సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. భక్తులు ముందుగా స్పాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. బుకింగ్ కొరకు నెంబర్లు తెలియజేస్తామన్నారు. ఆలయంలో స్వామివారి పాదుకలు, తీర్ధప్రసాదాలు ఇవ్వబోమని ఈవో తెలియజేశారు.
భక్తులెవరూ పూజా ద్రవ్యాలు తీసుకురావొద్దని చెప్పారు. నిత్యకల్యాణం, రుద్రాభిషేకాలకు ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించి పూజలు జరిపించుకోవచ్చని తెలిపారు. ప్రసాదాలు కూడా పోస్టుల ద్వారా పంపుతామని తెలిపారు. 65 సంవత్సరాల వయస్సు దాటిన వారు, చిన్నారులు గుడికి రాకపోవడం మంచిదని సూచించారు. దేవాదాయ శాఖ నియమ నిబంధనలకు లోబడి ఆలయంలో దర్శనాలు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: