ETV Bharat / state

ఈ యాప్ ఇన్​స్టాల్ చేస్తే ఇంకా అంతే..! - విజయవాడలో సైబర్ నేరాల వార్తలు

హలో మేం దిల్లీ సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఫోన్ నుంచి మహిళలను వేధిస్తున్నారని ఫిర్యాదు వచ్చిందంటూ బెదిరిస్తారు. బాధితుడు నేను కాదని చెప్పేసరికి.. మీ సిమ్ క్లోనింగ్ అయిందని చెప్పి.. ఓ లింక్ పంపుతారు. ఆ లింక్​పై క్లిక్ చేయగానే మీ చరవాణిని నేరస్థులు తమ అధీనంలోకి తీసుకొని మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు దోచేస్తారు. సైబర్ నేరగాళ్ల నయా దోపిడీ ఎలాగుందో చూద్దాం..!

money theft with phone hacking in vijayawada
ఈ యాప్ ఇన్​స్టాల్ చేస్తే ఇంకా అంతే!
author img

By

Published : Dec 5, 2019, 7:08 PM IST

సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకొని అమాయకులను ఏమారుస్తున్నారు. ఒకవైపు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెరుగినా.. మరోవైపు నూతన విధానాలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఓటీపీ, మెయిల్ పంపి... బ్యాంక్ వివరాలకు ఫోన్ చేసేవారు. ఇప్పుడు స్టైల్ మార్చారు. ఏకంగా చరవాణిని అధీనంలోకి తీసుకొని పని కానిచ్చేస్తున్నారు.

బెదిరించాడు.. నమ్మించాడు.. దోచేశాడు
విజయవాడ మాచవరానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ ఫోన్ చేసి... మహిళలను వేధిస్తున్నావని బెదిరించారు. బాధితుడు కంగారుపడి తనకేం తెలీదని చెప్పగా... అయితే మీ యాపిల్ ఫోన్‌లోని సిమ్​ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వేసుకోవాలని సూచించారు. డివోటీ సెక్యూర్, ఏపికే డెస్క్ ఫైల్‌ చరవాణిలో నిక్షిప్తం చేసుకోవాలని... కాంటాక్ట్ నెంబర్లు సేవ్ చేసుకొని వాటిని బ్లాక్ చేస్తే సరిపోతుందన్నారు. అలా చేసిన మూడు రోజుల వ్యవధిలోనే విడతల వారీగా బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 7లక్షల71 వేల నగదు దోచేశారు. చరవాణిలోని సమాచారం తస్కరించి... నగదు దోచేశారని పోలీసులు గుర్తించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈజీగా నమ్మకండి...
ఎవరైనా పోలీసులమని ఫోన్ చేసి బెదిరిస్తే నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

ఈ యాప్ ఇన్​స్టాల్ చేస్తే ఇంకా అంతే!

ఇదీచూడండి.నందిగామలో 112 యాప్​పై అవగాహన కార్యక్రమం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.