ETV Bharat / state

మోదీ ప్రభుత్వం ఏ రంగాన్ని అమ్మడం లేదు: రమేష్ చంద్ర రతన్

author img

By

Published : Sep 15, 2021, 7:06 PM IST

వివిధ రంగాలకు నిధులను సేకరించి.. వాటిని మరింత బలోపేతం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు రైల్వే పాసెంజర్ సౌకర్యాల కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్. మోదీ ప్రభుత్వం ఏ రంగాన్ని అమ్మబోవడం లేదన్నారు. కేంద్రం చేపట్టిన నిధీకరణపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.

Ramesh Chandra Ratan
రమేష్ చంద్ర రతన్

కేంద్రం చేపట్టిన నిధీకరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు రైల్వే పాసెంజర్ సర్వీసెస్, సౌకర్యాల కమిటీ చైర్మన్ రమేష్ చంద్రరతన్. నిధీకరణ ప్రయత్నాలన్నీ ఆయా రంగాలను మరింత బలోపేతం చేయడానికే తప్ప వేరే కాదని ఆయన వివరించారు. మోదీ ప్రభుత్వం ఏ రంగాన్ని అమ్మబోవడం లేదన్నారు. దేశంలోని వివిధ రంగాలను మోదీ ప్రపంచస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్షాలు ప్రధానిపై బురద జల్లేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. కొవిడ్ సమయంలో రైల్వేశాఖ దేశానికి ఒక లైఫ్ లైన్​లా నిలిచి విశిష్ట సేవలు అందించిందని గుర్తు చేశారు. రైల్వేశాఖ పని చేసి ఉండకపోతే..దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా దెబ్బ తినేదన్నారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించేందుకు వచ్చిన రతన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ, నెల్లూరు, తిరుపతి, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఆయన ప్రయాణికులకు కల్పించిన వసతులను పరిశీలించారు. రక్షణ, సౌకర్యాలు సంతృప్తినిచ్చాయని వెల్లడించారు. ప్రతి స్టేషన్​లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించామని వివరించారు. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో స్వచ్ఛత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రతన్ తెలిపారు.

ఇదీ చదవండి : LOKESH: ఒక్క ఛాన్స్ సీఎం జగన్ ఏపీని ఆప్ఘనిస్తాన్​లా మార్చేశారు: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.