ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతున్నకొద్దీ అందరిలో ఉత్కంఠ నెలకొందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విజయవాడ భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో తెదేపా హవా తగ్గిందని అభిప్రాయపడ్డారు. భాజపా, వైకాపాకు మధ్య బంధం ఉందంటూ చేసిన అసత్య ప్రచారం జగన్కు లాభం చేకూర్చిందన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఇదీ చదవండి...