పాలకులు కార్పొరేట్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని.. దీనికి భిన్నంగా ప్రత్యామ్నాయం కోసం ప్రజా నాట్యమండలి కళారూపాల ద్వారా ఉద్యమించాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పోరంకిలో మూడు రోజుల పాటు జరుగనున్న ప్రజా నాట్యమండలి 10వ రాష్ట్ర మహాసభలను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒకే భాష, ఒకే మతం, ఒకే తిండి పేరుతో సాంస్కృతిక ఆదిపత్యం కోసం పాకులాడుతోందని, దానిలో భాగమే దేశంలో మతపరమైన విభజన కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమకు అంబేడ్కర్ పేరు పెడితే ఎందుకు రచ్చ చేస్తున్నారని భాజపా, తెదేపా, వైకాపా, జనసేనలను.. కె.ఎస్.లక్ష్మణరావు ప్రశ్నించారు.
ప్రజా నాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగరాజు అధ్యక్షతన జరిగిన సభలో సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ఆంధ్ర, తెలంగాణ పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శులు ఎస్.అనిల్, మట్టా నరసింహారావు, ఆహ్వాన సంఘం కార్యదర్శి దూపగుంట్ల రామారావు, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి షేక్.ఖాసీం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వై.నరసింహారావు పాల్గొన్నారు. తొలుత ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఇవీ చూడండి: