ఇదీ చదవండి:
'కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేకపోతే... ఎన్నికలు వాయిదా వేయాలి' - స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో తెదేపా అభ్యర్థుల నామినేషన్లు దాఖలు కాకుండా వైకాపా ప్రయత్నిస్తోందని.. తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. పదవులు పోతాయనే భయంతో మంత్రులు అన్ని రకాల దొడ్డిదారులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూ పత్రాలు పంపిణీలో జాప్యంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని.. లేదా ఎన్నికలైనా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్య