రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డా? రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డా? అనే అయోమయం ప్రజల్లో కలుగుతోందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
జీఎన్‌రావు, బీసీజీ నివేదికల్లోని వాస్తవాలను ప్రజల దృష్టికి రానీయకుండా జగన్ తన సొంత అంశాలను బయటకు తీసుకొచ్చారనేది రుజువు అవుతోందన్నారు. తుపాను ప్రభావితమైన విశాఖపట్నం... రాజధానికి అనువైన ప్రదేశం కాదని వారి నివేదికల్లో వెల్లడించినా... తన స్వార్ధప్రయోజనం కోసమే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఉన్నభూములలో రాజదాని కట్టడం చేతగాక విశాఖపట్నంలో భూ సేకరణ చేస్తున్నారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం చర్యల కారణంగానే కోట్ల రూపాయలు పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని మండిపడ్డారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోనూ... వాస్తవాలు బయటకు వస్తాయనే సీబీఐ విచారణ జరపకుండా కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: తెదేపా శ్రేణుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు