లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 100 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఒక్కొక్కరికీ 600 రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. లాక్డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులు సమస్యలను తెదేపా నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు అశోక్‌బాబు దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన అశోక్‌బాబు సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. దీంతో ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు, కోటేశ్వరరావుకు విభిన్న ప్రతిభావంతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా కాటుకు దినసరి కూలీలు విలవిల