ప్రజల ఆరోగ్యం, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రభుత్వ వైద్య రంగంలో పలు సంస్కరణలు చేపట్టిందని ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు తెలిపారు. చందర్లపాడు మండలం తుర్లపాడు, వెలది కొత్తపాలెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను నిర్మించి, అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా ఆయా గ్రామాల్లోని ప్రజలకు మరింత మేలు కలుగుతుందని, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...