ETV Bharat / state

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ - chandarlapadu latest news

కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఎమ్మెల్యే జగన్​మోహన్​​రావు పరామర్శించారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.7 లక్షల చెక్కును అందించారు.

mla jagan mohan rao visited suicide farmer family
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
author img

By

Published : Jan 20, 2021, 10:52 PM IST

కృష్ణాజిల్లా చందర్లపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కట్టా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్​మోహన్​రావు పరామర్శించారు. రైతు ఆత్మహత్య బాధాకరమన్నారు.

రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కింద 7 లక్షల చెక్కును అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు.

ఇదీ చదవండి: ట్రాక్టర్ బోల్తా...వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.