కొవిడ్ –19 నివారణ సహాయ చర్యలకు సీఎం సహాయనిధికి మిత్రా ఎనర్జీ 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన మిత్రా ఎనర్జీ ఎండీ విక్రమ్ కైలాష్.. ఆన్‌లైన్‌లో విరాళం పంపిన పత్రాలను అందించారు.
గంగవరం పోర్టు 3 కోట్ల రూపాయల విరాళం అందించింది. పోర్టు ఛైర్మన్ డి.వి.ఎస్.రాజు, సీఈఓ, మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు.. ఇందుకు సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రికి అందించారు. గంగవరం పోర్టులో షేర్ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్ డివిడెండ్ చెక్‌ను ఇచ్చారు.
ఇదీ చూడండి: