అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షించారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలోని రైతు సాధికార సంస్థ సమావేశ మందిరంలో నీటిపారుదల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని 63 మండలాల్లో 70 శాతం అధికంగా వర్షపాతం కురిసిందని.. సాగు, తాగు నీరు పుష్కలంగా ఉందని మంత్రులు పేర్కొన్నారు. అవసరాల కోసం ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మడకశిర తదితర ప్రాంతాలకు బుక్కపట్నం చెరువు నుంచి తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు.
ఇవీ చూడండి..