కృష్ణా జిల్లా గుడివాడలో 11 కోట్ల నిధులతో ఆస్పత్రి నూతన భవన, నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. తెదేపా హయాంలో భూకబ్జాలు, ప్రజలపై దాడులు విచ్చలవిడిగా జరిగేవని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని పేకాట శిబిరంగా మార్చారని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే, మంత్రి కొడాలి నాని పై దాడులు చేస్తున్నారన్నారు.
సంక్షేమ పథకాలు అమలైతే, నామరూపాలు లేకుండా పోతామన్నా భయంతో.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయన్నారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని వివరించారు. దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడుతున్న ముఖ్యమంత్రికి ప్రజల తరఫున మంత్రి కొడాలి నాని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: రైతు భరోసా కేంద్రాల పేరుతో ప్రభుత్వం మోసం: దేవినేని