ETV Bharat / state

రేషన్ సరకులు అందించే వాహనాలను పరిశీలించిన మంత్రులు

చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసరాలను నేరుగా ఇంటివద్దకే తీసుకెళ్లే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికోసం రూపొందించిన వాహనాలను రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొడాలి నాని, చెరకువాడ రంగనాథరాజు పరిశీలించారు.

Ministers  inspect
Ministers inspect
author img

By

Published : Jun 19, 2020, 4:12 PM IST

గ్రామాల్లో పౌరసరఫరాల శాఖ పనితీరుపై ఎన్నో విమర్శలున్నాయి. రేషన్ సరుకుల్లో నాణ్యత లేదని..పంపిణీ సమయంలో ప్రజలను డీలర్ల ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే రేషన్ సరుకులను అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వాటికోసం రూపొందించిన వాహనాలను విజయవాడలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొడాలి నాని, చెరకువాడ రంగనాథరాజు పరిశీలించారు.

విజయవాడ సబ్‌ కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ నమూనా వాహనాలను మంత్రులకు చూపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ద్వారా నిత్యావసర సరకులను ఇంటి వద్దకే ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పమని మంత్రి బుగ్గన తెలిపారు. ఆ దిశగా త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అవినీతికి తావులేకుండా నాణ్యమైన నిత్యావసరాలను పేదలకు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ముఖ్యంగా మురికివాడలు, మండల ప్రధాన కేంద్రాల్లో ఈ వాహనాలను నమూనాగా తిప్పి లోటుపాట్లను గుర్తించాలన్నారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.