చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రులు రాష్ట్రం సంపూర్ణాభివృద్ధి సాధించాలంటే అధికార వికేంద్రీకరణ అవసరమని మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని అభిప్రాయపడ్డారు. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 3 రాజధానులకు మద్దతుగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోనేరు సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దనీ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అధికార వికేంద్రీకరణకు మద్దతు పలకాలని కోరారు. ఇదీ చదవండి: వైకాపా నాయకుల మధ్య వర్గ పోరు