లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడపలోకి తీసుకెళ్లి అమలు చేస్తోందన్నారు. అదే తరహాలో వర్తక సంఘాలు, ఛాంబర్ అఫ్ కామర్స్ సహకారంతో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసున్నట్టు చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పేదలకు వాటిని అందించారు. ప్రజలంతా కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.
ఇదీ చదవండి:
కేసులకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం: కరోనా ప్రత్యేకాధికారి