ETV Bharat / state

విద్యార్థి మృతిపై ఆర్జేడీతో విచారణ జరుపుతున్నాం : మంత్రి సురేశ్‌

కృష్ణా జిల్లా అనాసాగరం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థి మృతిపై మంత్రి సురేశ్‌ స్పందించారు. విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటనపై ఆర్జేడీతో విచారణ జరుపుతున్నామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.

minister adimulapu suresh
మంత్రి సురేశ్‌
author img

By

Published : Aug 25, 2021, 10:16 PM IST

కృష్ణా జిల్లా నందిగామ శివార్లలోని అనాసాగరం జడ్పీ హైస్కూల్ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. పాఠశాలల్లో విద్యార్థులను పనులకు వినియోగించటంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆర్జేడీతో విచారణ చేయిస్తున్నట్టు వెల్లడించారు. ఘటనపై తక్షణమే ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నామని మంత్రి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

పాఠశాలలో విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో పనులకు ఆయాల సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా విద్యార్థులతో పనులు చేయిస్తున్నట్లు తెలిస్తే ఉపేక్షించబోమన్నారు. మృతి చెందిన విద్యార్థి గోపీచంద్ కుటుంబానికి మంత్రి సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతం.. పదో తరగతి విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.