‘నడక’ సమస్త అవయవాలను ఉత్తేజపరిచే యంత్రం లాంటిదని మంత్రి పేర్ని నాని అన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలైన నడిస్తే ప్రస్తుతం ఉన్న వ్యాధుల నియంత్రణతోపాటు.. భవిష్యత్తులో కొత్త వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. మచిలీపట్నం మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన వాకింగ్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అనేక రోగాలు వస్తున్న నేపథ్యంలో.. వాకింగ్ ట్రాక్ నిర్మాణ కోసం వాకర్స్ అసోసియేషన్ స్వయంకృషి, ఐక్యమత్యం అభినందనీయం అన్నారు. ట్రాక్ నిర్మాణానికి అసోసియేషన్ సభ్యులు వెచ్చించిన రూ. 25 వేలను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.
మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నడక దారిని సుందరంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన మార్నింగ్ వాక్ మిత్ర మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. స్థానికంగా ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కృషి చేసిన పలువురిని మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా, వైస్ ఛైర్మెన్ తోట సత్యనారాయణతోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
YS Viveka Murder Case: 20 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. వెలుగులోకి దస్తగిరి వాంగ్మూలం!