ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఏకపక్ష జీవోలు ఇచ్చి.. దళిత వర్గాలను మోసం చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాల కంటే తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలని కొడాలి నాని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల23న విచారణకు హాజరుకావాలని ఆదేశం