ETV Bharat / state

'భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర హస్తం.. ఆధారాలున్నాయి' - కొల్లు రవీంద్రపై కొడాలి నాని వ్యాఖ్యలు

వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని.. మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని.. అందుకే అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు.

minister kodali nani about kollu ravindra
కొడాలి నాని, మంత్రి
author img

By

Published : Jul 4, 2020, 2:05 PM IST

ఇటీవల హత్యకు గురైన భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రవీంద్ర ఏ తప్పూ చేయకపోతే మచిలీపట్నం నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని.. అందుకే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఆయన తప్పు చేసినట్లు ఆధారాలు దొరికాయని.. తప్పు చేసినవాళ్లకు శిక్ష తప్పదని అన్నారు.

'వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉంది. రవీంద్ర ఆకృత్యాలను, అవినీతిని మీడియా ముందు ఎండగడుతున్నారనే భాస్కరరావుపై కక్ష పెంచుకున్నారు. రవీంద్ర హత్య చేయించి ఉండకపోతే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో ఆయన ప్రోద్బలంతోనే హత్య జరిగనట్లు తేలింది. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు' - కొడాలి నాని, మంత్రి

ఇవీ చదవండి...

గూడూరు పీఎస్​లో మాజీమంత్రి కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.