ETV Bharat / state

టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్ : మంత్రి గౌతమ్ రెడ్డి - టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఏపీని టైక్స్‌టైల్​ హబ్‌గా మారుస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. టెక్స్​టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు.

minister gowtham reddy
minister gowtham reddy
author img

By

Published : Jul 11, 2020, 9:45 AM IST

ఏపీని టైక్స్‌టైల్​ హబ్​గా మార్చుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్​ను కేంద్రబిందువుగా మార్చుతామన్నారు. కొవిడ్ ప్రపంచంలో వాణిజ్య, పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. ముందుకెళ్తున్నామని తెలిపారు.

టైక్స్‌టైల్ రంగంపై నిర్వహించే ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్​క్లూజివ్ ఇన్వెస్ట్​మెంట్ ఫోరమ్ వెబినార్​ను కేంద్ర చేనేత శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. కర్ణాటక, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన చేనేత శాఖ మంత్రులు, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం, చేనేత ఉత్పత్తులు, వారి కళానైపుణ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపునకు, మార్కెటింగ్ అంశాలపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, భవిష్యత్​లో ఆచరణలో పెట్టబోయే వినూత్న ఆలోచనలను మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తైన నూలును ఫాబ్రిక్​గా మార్చడం.. గార్మెంట్స్, గ్లోబల్ టెక్స్‌టైల్ రంగంలో గమ్యస్థానంగా మార్చడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వస్త్ర తయారీరంగంలో ఆంధ్రప్రదేశ్​ను ప్రత్యేకంగా నిలిపేలా మౌలిక సదుపాయాలు అందిస్తామని మంత్రి తెలిపారు. టెక్స్​టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ అందిస్తామన్నారు. దిగుమతి, ఎగుమతులు సహా పోర్టులకు సమీపంలో కారిడార్ల ద్వారా రవాణా సంబంధిత అంశాల్లో అనుసంధానం చేసి సహకరిస్తామన్నారు. 30 నైపుణ్య శిక్షణాభివృద్ధి కళాశాలలను ఏర్పాటు చేసి.. ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవ వనరులను సృష్టిస్తామన్నారు.

ఇదీ చదవండి:

75% ఇంటర్‌ మార్కుల నిబంధన ఎత్తివేత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.