ఫణి తుపాను ముప్పు పొంచి ఉన్నందున... రైతులు పండించిన ధాన్యం తడవకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. పెను తుపాను రానున్న నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి, మైలవరం మార్కెట్ యార్డులను మంత్రి సందర్శించారు. యార్డులో ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తేమ శాతంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం తడవకుండా అధికారులు బాధ్యత వహించాలన్న మంత్రి... అవసరమైన పట్టాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి...