రైతులకు 5 వేల కోట్లరూపాయలు కేటాయించాం : మంత్రి దేవినేని - nagarjuna sagar
జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావు మైలవరంలో రైతు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను కర్షకులు వినియోగించుకొని ఆర్థికంగా స్థిర పడాలని ఆకాంక్షించారు.
జలవనరుల శాఖ మంత్రి
కృష్ణా జిల్లా మైలవరంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ వద్ద క్షేత్రస్థాయి రైతు శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. భవిష్యత్తులో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రవేశపెడతామన్నారు. బడ్జెట్ లో రైతులకు 5వేల కోట్లు కేటాయించడం..ఆనందించదగిన విషయమన్నారు.
sample description