దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బృందం కలిసింది. ఈ బృందంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్, నీటిపారుదలశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌లు ఉన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఈ బృందం కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించింది. పోలవరం పెండింగ్ బిల్లులు, ఇతర అంశాలపై భేటీలో మాట్లాడారు. కరోనా వల్ల...రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పన్ను రాబడి లేనందున కేంద్ర సహాయం కోరామని... రాష్ట్రానికి వచ్చే నిధులను గురించి అడిగామని తెలిపారు. పోలవరంలో బిల్లింగ్ జరిగిన 3,500 కోట్లు మనకు రావాలని..వాటిని అడిగామని అన్నారు. పునర్ వ్యవస్థకరణ చట్టంలో మనకు రావాల్సిన రెవెన్యూ బకాయిలను..కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించవచ్చని వెల్లడించారు.
ఏప్రిల్, మేలో జీఎస్టీ పాత బకాయులు కలుపుకోని 3 వేల కోట్లకు పైగా రావాలని అన్నారు. ఏప్రిల్, మే, జూన్‌లో రెవెన్యూలోటు 40 శాతం తక్కువగా ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా మార్చి..నిరుపయోగంగా చేశారన్నారు. కేంద్రం సహాయం చేసే 20 లక్షల కోట్లలో..పర్సెంటెజ్ ప్రకారం మన రాష్ట్రానికి కూడా ఇస్తారని పేర్కొన్నారు. నిధుల సమీకరణలో కేంద్రం గ్రాంట్లు, పునర్ వ్యవస్థకరణ చట్టంలో మనకు రావల్సిన బకాయిలు, బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం వంటివి భాగమవుతాయని బుగ్గన అన్నారు.
ఇదీ చూడండి. రాజ్‌నాథ్ సింగ్‌కు చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు