ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం, ఇతర సరుకులను కార్డుదారుని ఇంటికే అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 9 వేల 260 మినీ ట్రక్కుల తయారీకి మారుతి సుజుకి, టాటా కంపెనీలకు సర్కారు అనుమతిచ్చింది. అందులో 2 వేల 750 వాహనాలను వరుణ్ మారుతి సంస్థ సిద్ధంగా ఉంచింది. విజయవాడ గూడవల్లి వద్ద వాహనాల లోపల సామగ్రి అమర్చి.. స్టిక్కరింగ్ పనులను పూర్తి చేసింది. జనవరి నుంచి సరుకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ వాహనాలను వినియోగించనున్నారు.
ఇదీ చదవండి: 98 మంది ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ పూర్తి