వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలు జిల్లాల వలసకూలీలను.. అధికారులు బస్సుల్లో సొంత గ్రామాలకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా కూచిపూడి, ఘంటసాల, చల్లపల్లిలో చిక్కుకున్న 334 మందిని 8 బస్సుల ద్వారా స్వస్థలాలకు పంపించారు. ఈమేరకు ఆర్టీసీ బస్సులను.. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. వలస కూలీలకు కావల్సిన ఆహారం, తాగునీటిని అందించారు. ఇతర రాష్టాలకు చెందిన వారిని కూడా అనుమతులు వచ్చిన వెంటనే పంపుతామని తెలిపారు.
ఇదీ చదవండి: 'నడి రోడ్డుపై పంట పారబోసే పరిస్థితి రాకూడదు'